భారత్‌కు చెందిన సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌లు కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. అప్పటి నుంచి కుటుంబ నియంత్రణ పాటిస్తూ వచ్చిన వీరిద్దరూ ఇపుడూ తమ అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పారు.
ఇటు మీర్జా, అటు మాలిక్, మధ్యలో మీర్జా మాలిక్ అంటూ ఓ కప్‌బోర్డ్ ఫొటో పోస్ట్ చేసి పరోక్షంగా తాను తల్లి కాబోతున్నాను అన్న మెసేజ్‌ను అభిమానులకు సానియా వెల్లడించింది.
బేబీ మీర్జామాలిక్ అంటూ సానియా క్యాప్షన్ ఇవ్వడంతో ఆమె స్నేహితులు, బంధువులు కంగ్రాట్స్ చెప్పడం మొదలుపెట్టారు. ఈ మధ్యే తనకు పుట్టబోయే పిల్లల ఇంటి పేరు మీర్జామాలిక్ గానే ఉండాలని తాము నిర్ణయించుకున్నట్లు సానియా చెప్పిన విషయం తెలిసిందే.