సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీడియాపై మండిపడుతూ వరుస ట్వీట్లు చేస్తున్నారు. తన తల్లిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ.. ఒక్కొక్కరి పేర్లను బయటపెడుతూ వారిపై న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా తన సోషల్ మీడియా ఖాతా నుంచి మీడియా సంస్థల అధిపతులపై తన ట్విట్టర్ వార్ కొనసాగిస్తున్నారు.
టీవీ9 రవిప్రకాశ్ కాళ్లను ఓ వ్యక్తి పట్టుకున్న 16 సెకన్ల నిడివి గల ఓ వీడియోను పవన్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వర్మ ట్వీట్ చేస్తూ.. "హేయ్ పవన్ కల్యాణ్... ఈ వీడియో కొత్తదేమీ కాదు. ఎప్పుడో ఐదేళ్ల క్రితం నాటి వీడియో. లక్షల సార్లు ఈ వీడియో ఇప్పటికే సర్క్యులేట్ అయింది. నువ్వు చూడడం మాత్రం తొలిసారేమో. దాని గురించి ఇప్పటికే అతను వివరణ కూడా ఇచ్చాడన్నాడు.
అయితే వర్మ చేసిన వ్యాఖ్యలను ఏమాత్రం పట్టంచుకో పవన్.. మీడియాను వరుస ట్వీట్లతో ఏకిపారేస్తున్నాడు. తాజాగా ఎల్లో మీడియాను బహిష్కరించండంటూ పవన్ పిలుపునిచ్చాడు. ఈ మేరకు ''జనసేన'' ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. మన తల్లులను, బిడ్డలను, సోదరీమణులను దూషిస్తున్న టీవీ 9, టీవీ 5, ఏబీఎన్‌లను బహిష్కరించండంటూ పిలుపు నిచ్చారు. నగ్నత్వంతో, అమర్యాదకరంగా వ్యాపారం చేసుకుంటున్నందుకూ వాటిని మనం దూరం పెట్టాలని.. నిస్సహాయురాలైన సోదరిని ఉపయోగించుకుని వ్యాపారం చేస్తున్నారని పవన్ ట్వీట్లలో విమర్శలు గుప్పించారు.