భారత పరుగుల రాణి హిమాదాస్ కరోనా వైరస్ సోకింది. ఆమెకు జరిపిన పరీక్షా ఫలితాల్లో ఈ విషయం వెల్లడైంది. ఆమెకు పాటియాలాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్‌ఐఎస్)లో కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షా ఫలితాల్లో ఆమెకు పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు వెల్లడించారు.
కాగా, హిమాదాస్ 2018లో అండర్-20 ప్రపంచ చాంపియన్ షిప్‌లో 400 మీటర్ల ఈవెంట్‌లో విజయం సాధించింది.. ఈ ఈవెంట్‌లో ప్రపంచ టైటిల్ గెలిచిన తొలి భారతీయ స్ప్రింటర్‌గా నిలిచింది. జూలై-ఆగస్టులో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌కు ఆమె అర్హత సాధించలేకపోయింది. ప్రస్తుతం హిమ కామన్వెల్త్, ఆసియా గేమ్స్‌పై దృష్టి పెట్టింది.