దూకుడు కొనసాగిస్తాం: రాంచీ రాకెట్

శుక్రవారం, 26 అక్టోబరు 2007 (09:39 IST)
PTI PhotoPTI
భవిష్యత్‌లో కూడా భారత్ జట్టు దూకుడును కొనసాగిస్తుందని టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అన్నాడు. జార్ఖండ్ ప్రభుత్వం గురువారం ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో రాంచీ రాకెట్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రత్యర్థిపై ఒత్తిడిని పెంచేందుకు తాము దూకుడును కొనసాగిస్తాయమని స్పష్టం చేశాడు. భారత్ సాధించిన విజయాలు జట్టు సభ్యుల సమిష్టి కృషి ఫలితం అని ధోని అన్నాడు.

కార్యక్రమంలో ధోనికి జార్ఖండ్ ప్రభుత్వం ప్రకటించిన ఆశ్చర్యకర బహుమతి...టయోటా కరోలా లగ్జరీకారు, రూ. ఐదు లక్షల చెక్‌ను జార్ఖండ్ ముఖ్యంత్రి మధు కొడా అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ధోనికి ప్రభుత్వం ప్రకటించిన `జార్ఖండ్ రత్న` అవార్డును నవంబరు 15న జరిగే రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ప్రధానం చేస్తామని తెలిపారు. ఐతే తనకు ప్రభుత్వం ఇచ్చిన రూ. ఐదు లక్షల చెక్‌ను ముఖ్యమంత్రి సహాయనిధికి ధోని అందజేసి తన ఔన్నత్యాన్ని చూపాడు.

వెబ్దునియా పై చదవండి