భజ్జీపై నిషేధం ఎత్తివేయాలి: బీసీసీఐ

సోమవారం, 7 జనవరి 2008 (11:46 IST)
భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్‌పై మూడు మ్యాచ్‌ల నిషేధం విధించడాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఖండించింది. జాతి వివక్ష పట్ల తమ ఆటగాళ్లతో పాటు.. భారతదేశం తీవ్ర వ్యతిరేకమని పేర్కొంది. తమ ఆటాగాళ్లపై నిరాధారమైన జాతి వివక్ష ఆరోపణలు చేస్తే సహించబోమని బీసీసీఐ హెచ్చరించింది. అంతేకాకుండా.. హర్భజన్ సింగ్‌పై విధించిన మూడు మ్యాచ్‌ల నిషేధాని ఎత్తివేయాలని ఐసిసిని విజ్ఞప్తి చేసింది. దీనిపై అప్పీలు చేయాల్సిందిగా జట్టు మేనేజ్‌మెంట్‌కు బీసీసీఐ ఆదేశాలు జారీ చేసినట్టు బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించాడు.

దోష పూరిత అంపైరింగ్‌ను ఎట్టిపరిస్థితుల్లోను సహించబోమని, అంపైర్లు ఇరు జట్లకు తటస్థంగా వ్యవహరించాలన్నాడు. ఇదిలావుండగా.. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా, మాజీ క్రికెటర్లు ఎర్రపల్లి ప్రసన్న, కిరణ్ మోరే, సయ్యద్ కిర్మాణీ తదితరులు భారత జట్టును తక్షణం స్వదేశానికి పిలిపించాలని అభిప్రాయపడ్డారు.

వెబ్దునియా పై చదవండి