జాతీయ రైఫిల్ షూటింగ్: రాజ్యవర్థన్ రాథోడ్ స్వర్ణం!

స్టార్ షూటర్ రాజ్యవర్ధన్ రాథోడ్ మళ్లీ తన సత్తా ఏంటూ నిరూపించుకున్నాడు. జాతీయ రైఫిల్ షూటింగ్ సంఘం (ఎన్ఆర్ఏఐ) అధికారుల వ్యవహారశైలితో కొంతకాలం క్రీడలకు దూరంగా ఉన్న రాథోడ్ సీనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణపతకం సాధించాడు.

జాతీయ సీనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ‘డబుల్ ట్రాప్’ ఈవెంట్‌లో అద్భుతంగా రాణించిన రాథోడ్ విమర్శకుల నోర్లు మూయించేశాడు. ఈ టోర్నీలో ఆర్మీ తరఫున బరిలోకి దిగిన ఈ ‘డబుల్ ఒలింపియన్’ క్వాలిఫయింగ్‌లో 138 పాయింట్లు... ఫైనల్లో 42 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచాడు.

వెబ్దునియా పై చదవండి