కావలసిన పదార్థాలు : మినప్పప్పు... అరకేజీ బెల్లం తురుము... అరకేజీ నీళ్లు... తగినన్ని నూనె... వేయించేందుకు సరిపడా నెయ్యి... 50 గ్రా. యాలకులు... ఒక టీ. ఉప్పు... తగినంత
తయారీ విధానం : బెల్లం తురుములో తగినన్ని నీళ్లు పోసి లేతపాకం పట్టి, అందులో యాలక్కాయల పొడిని కలిపి ఉంచాలి. పొట్టు తీసిన మినప్పప్పును ఓ పూట ముందుగానే నానబెట్టాలి. పప్పులోని నీళ్లన్నీ వంపేసి తగినంత ఉప్పు వేసి గట్టిగా రుబ్బుకోవాలి. మీడియం సైజులో గారెలు వత్తుకుని.. నెయ్యి కలిపిన నూనెలో దోరగా వేయించి, పాకంలో వేయాలి. ఓ పూటంతా కదపకుండా ఉంచితే పాకంలో గారెలు బాగా నాని రుచిగా ఉంటాయి. అంతే మినప్పప్పు పాకం గారెలు రెడీ అయినట్లే...!