అయితే ప్రభుత్వ ఈ నిర్ణయం పై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ మద్దతు తెలపడం విశేషం. సంధ్య థియేటర్‌కు వెళ్లే ముందు రోడ్ షో చేసుకుంటూ వెళ్లిన అల్లు అర్జున్.. రేవతి అనే మహిళ మరణించిందని బయటికి వెళ్లాల్సిందేనని పోలీసులు చెప్పాక కూడా.. కారు టాప్ తీసి అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్లాడని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రోడ్ షోల కారణంగా తొక్కిసలాట జరిగిందన్నారు. ఈ ఘటనలో తల్లి రేవతి చనిపోయింది. ఆమె కొడుకు కోమాలోకి వెళ్ళాడు.
అంత తొక్కిసలాటలో కూడా ఆ తల్లి కొడుకు చేయి విడిచిపెట్టలేదు.. బిడ్డపై తల్లి ప్రేమ అలాంటిది. కొడుకు చేయి పట్టుకుని ఆ తల్లి చనిపోయింది.. హీరో థియేటర్ లోపల ఉండటం వల్ల లోపల కూడా తొక్కిసలాట జరిగింది. తన కొడుకు ఆ హీరో అభిమాని అని కొడుకు కోసం ఒక్కో టికెట్ రూ.3వేల చొప్పున రూ.12వేలు పెట్టి ఆ కుటుంబం సినిమా టికెట్లు కొన్నారు.
థియేటర్‌లో ఒక తల్లి చనిపోతే ఆ కుటుంబాన్ని, ఆ పిల్లవాన్ని హీరో పరామర్శించలేదు. అలాంటి మానవత్వం లేని వాళ్ళను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తే పదేళ్లు మంత్రులుగా పని చేసిన వాళ్లు కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. సెలెబ్రిటీలు విమర్శించడం ఏంటని ప్రశ్నించారు.