భయపడటం లేదు... సభలో చర్చ జరగాలని కోరుతున్నాం : మాజీ మంత్రి కేటీఆర్

ఠాగూర్

శుక్రవారం, 20 డిశెంబరు 2024 (13:20 IST)
ఫార్ములా ఈ-రేసు కోసం నిధుల మళ్లింపు కేసు అంశంలో తాను భయపడటం లేదని, అసెంబ్లీ వేదికగా చర్చ జరగాలని భావిస్తున్నామని భారత ారష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇదే అంశంపై ఆయన శుక్రవారం మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. 
 
'మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాటలతో నాపై నమోదైన కేసులో అవినీతి లేదని తేలింది. ఆయనే అవినీతి జరగలేదన్నారు. ప్రభుత్వం కేసుపై ముందుకు వెళ్తే న్యాయపరంగా ఎదుర్కొంటాం. హెచ్‌ఎండీఏలో చేసే ప్రతి పనికి ప్రభుత్వం అనుమతి అవసరం లేదు. దానికి ఆ మేరకు స్వతంత్రత ఉంది. ఫార్ములా ఈ-రేసులో కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు. ముఖ్యమంత్రా.. మంత్రులా.. తప్పుదోవ పట్టిస్తోందెవరో తెలియాలి.
 
టీఓటీ (టోల్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌) పద్ధతి దేశంలో ఇప్పటికే అమలులో ఉంది. ఓఆర్‌ఆర్‌ లీజు డబ్బు రైతు రుణమాఫీకి వాడాం. అప్పటి క్యాబినెట్‌ సబ్‌ కమిటీ.. ఓఆర్ఆర్‌ లీజుకు సూచించింది. నేషనల్‌ హైవే అథారిటీ తరహాలోనే ఓఆర్‌ఆర్‌ను లీజుకు ఇచ్చాం. అవినీతి జరిగితే ఆ ఒప్పందం ఇంకా ఎందుకు రద్దు చేయలేదు? కోకాపేట భూములపై రూ.10 వేల కోట్ల స్కామ్‌ అంటున్నారు. అవినీతి జరిగిందని భావిస్తే కోకాపేట భూముల అమ్మకం కూడా రద్దు చేయాలి' అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. 
 
హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా మృతి
 
హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇండియన్ నేషనల్ లోక్‌దళ అధినేృత (ఐఎన్‌డీఎల్) చీఫ్ ఓం ప్రకాష్ చౌతాలా ఇకలేరు. ఆయన శుక్రవారం కన్నుమూశారు. గురుగ్రావ్‌లోని తన నివాసంలో కార్డియాక్ అరెస్ట్‌తో చౌతాలా చనిపోయారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఆయన వయసు 50 యేళ్లు. హర్యానా రాజకీయాల్లో చౌతాలా తనదైన ముద్రవేశారు. 1989 నుంచి 2008 వరకు హర్యానా ఐదుసార్లు సీఎంగా చౌతాలా సేవలందించారు. వృద్దాప్యంతో పాటు అనారోగ్య సమస్యల కారణంగా ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు