ఆలయంలోకి వచ్చాడని దళిత యువకుడిని నగ్నంగా ఊరేగించారు.. ఎక్కడ?

సెల్వి

ఆదివారం, 4 మే 2025 (09:05 IST)
man
అంటరానితనం అమానుషం అని ఎందరు మహానుభావులు చెప్పినా.. మన జనాల్లో మార్పు అనేది రావట్లేదు. ఆధునికత పెరిగినా మనిషిలో మార్పు మాత్రం ఇంకా రాలేదు. తాజాగా తెలంగాణలో దారుణం జరిగింది. ఆలయంలోకి వచ్చాడని.. దళిత యువకుడిని నగ్నంగా ఊరేగించారు. 
 
అంతేగాకుండా.. ఆలయ గోడకు కట్టేసి దళిత యువకుడిపై ఆర్ఎస్ఎస్, బీజేపీ, భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ నాయకులు దాడికి పాల్పడ్డారు. మతిస్థిమితం లేని దళిత యువకుడు అజయ్ కుమార్ తాగి గుడి ఎక్కాడని ఈ దాడికి పాల్పడినట్లు ఆర్ఎస్ఎస్ఎస్ నాయకులు అంటున్నారు. 
 
ఈ ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వేచరేణి గ్రామంలో జరిగింది. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంకా ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు