తెలంగాణలో మహబూబ్‌నగర్, ఖమ్మం మినహా మిగిలిన అన్ని పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ డిపాజిట్లు కోల్పోయింది. గతంలో కేసీఆర్ పార్లమెంటుకు పోటీ చేసిన మెదక్‌లో కూడా ఆ పార్టీ పరాజయం చవిచూసి మూడో స్థానంలో నిలిచింది.
ఈ మధ్య కాలంలో బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ కనీసం పార్లమెంటు ఎన్నికల్లోనైనా ప్రజల ఆదేశాన్ని తిరిగి గెలవాలని భావించింది. కానీ, ఎన్నికల్లో సున్నా సీట్లు సాధించారు.