వీధికుక్కల దాడి.. శంషాబాద్‌లో బాలుడు అక్కడికక్కడే మృతి

సెల్వి

శుక్రవారం, 2 ఫిబ్రవరి 2024 (10:47 IST)
శంషాబాద్‌లో వీధికుక్కల దాడిలో ఏడాది వయసున్న బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం నాగారం గ్రామానికి చెందిన కోళ్ల సూర్యకుమార్, యాదమ్మ దంపతులు శంషాబాద్‌కు వలస వచ్చారు. 
 
రాళ్లగూడ సమీపంలో ఓ గుడిసెలో ఉంటూ కూలిపనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ దంపతులకు ముగ్గురు మగ పిల్లలు కాగా.. అందులో ఒకరు అనారోగ్యంతో, మరొకరు పుట్టిన వారం రోజులకే చనిపోయారు.
 
ప్రస్తుతం నిండు గర్భిణి అయిన యాదమ్మ ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరగా.. కొడుకు నాగరాజుతో కలిసి సూర్యకుమార్ గుడిసెలో ఉంటున్నాడు. అయితే, తెల్లవారుజామున మరోసారి నిద్రలేచిన నాగరాజు.. అమ్మ కనిపించకపోవడంతో ఏడుస్తూ గుడిసె బయటకు వచ్చాడు. 
 
దీంతో వీధికుక్కలు నాగరాజుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. అటుగా వెళుతున్న వాహనదారులు గమనించి వాటిని తరిమేశారు. అయితే, అప్పటికే నాగరాజు చనిపోయాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు