అయోధ్య రామ మందిర్ ఆలయ ట్రస్టుకు నిధుల వరద
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠకు గడువు సమీపిస్తుండటంతో ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఆలయ నిర్మాణానికి, భక్తులకు సౌకర్యాల కల్పనకు ఇప్పటివరకు రూ.900 కోట్లకు పైగా ఖర్చు చేశామని అయోధ్య ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవగిరి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఇచ్చిన విరాళాలతో ట్రస్టుకు కుబేరుని ఆశీర్వాదం ఉందన్నారు. ఇప్పటికే రూ.900 కోట్లు ఖర్చు చేసినప్పటికీ ఇంకా తమ వద్ద రూ.3 వేల కోట్ల మిగులు నిధులు ఉన్నట్లు వెల్లడించారు.