తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా సీఎస్ గా శాంతికుమారి నియామితులయ్యారు. సీనియర్ ఐఏఎస్ అధికారిణి అయిన ఆమె పేరును తెలంగాణ సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. దీంతో ఆమెను సీఎస్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా ఆమె ఏప్రిల్ 2025 వరకు కొనసాగనున్నారు.