రేషన్‌ కార్డు దారులకు తపాలాశాఖ సేవలు..

బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (08:24 IST)
తెలంగాణ రాష్ట్రంలోని రేషన్‌ కార్డు దారులకు తపాలాశాఖ సేవలందించనుంది. ఆధార్‌తో ఐరిస్‌, ఫోన్‌ నంబర్‌ అనుసంధాన సేవలు పొందవచ్చని తపాలాశాఖ పేర్కొంది. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 124 ఆధార్‌ కేంద్రాలు, 15 మొబైల్‌ కిట్ల ద్వారా సేవలందించనున్నట్లు తెలంగాణ తపాలా సర్కిల్‌ హైదరాబాద్‌ రీజియన్‌ తెలిపింది. 
 
ఆధార్‌ నంబర్‌ అప్‌డేషన్‌కు రూ.50, ఐరిస్‌కు రూ.100, రెండింటికీ రూ.100 ఛార్జీ తీసుకోనున్నట్లు పేర్కొంది. మొన్నటి వరకు రేషన్‌ సరుకుల పంపిణీలో బయోమెట్రిక్‌ (వేలిముద్ర) తీసుకునే విధానం అమలులో ఉండేది. కరోనా మహమ్మారి నేపథ్యంలో వేలిముద్రకు బదులుగా ఓటీపీ లేదా ఐరిస్‌ ద్వారా సరుకుల పంపిణీ ఈ నెల 1న మొదలైంది. 
 
అయితే ఆధార్‌ సంఖ్యతో మొబైల్‌ నంబర్‌ అనుసంధానించి ఉంటేనే ఓటీపీ వస్తుంది. చాలామంది ఆధార్‌కు మొబైల్‌ నంబర్‌ లింక్‌ లేకపోవడంతో ఈ తరహా సేవలందించడంపై తపాలాశాఖ దృష్టి సారించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు