తెలంగాణ రాష్ట్ర పండుగల్లో అతి పెద్ద పండుగ బతుకమ్మ. మనిషికి, పకృతికి సంబంధించిన పండుగగా బతుకమ్మ పండుగను చెప్పుకుంటారు. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంకి పకృతితో విడదీయని సంబంధం ఉంటుంది. ప్రకృతి మనిషికి జీవంతో పాటు ఆహ్లాదాన్ని ఇస్తుంది. బతుకమ్మ పండగకి మాత్రం ఖచ్చితంగా తొమ్మిది రోజులు మాత్రం ప్రతి మనిషి పకృతితో మమేకమై పోతారు అదే బతుకమ్మ పండుగ యొక్క గొప్పతనం.
ఈ పండుగను తొమ్మిది రోజులపాటు తొమ్మిది రూపాలతో బతుకమ్మను కొలుచుకోవడం ఆనవాయితీ. ఎంగిలిపూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నాన బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ (చివరిరోజు) రూపాల్లో నిర్వహిస్తారు. అయితే, ఈ పండుగను పురస్కరించుకుని తెరాస మహిళా నేత, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఓ పాటను ట్వీట్ చేశారు. ఈ పాట ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.