తన కారుకు ఎర్రబుగ్గ తగిలించుకొని స్థానికంగా హడావుడి చేసేవాడు. ఇఫ్తార్ విందుల పేరిట ప్రముఖుల్ని పిలిచి హంగామా చేసేవాడు. తన మిత్రుడుకు సఫారీ సూట్ వేసి గన్ మేన్ లా నటించమనేవాబు. ఖిఫాయత్ అలీ హడావుడి చూసి అతడు నిజంగానే సచివాలయ ఉద్యోగి అని స్థానికులు నమ్మారు. ఈ క్రమంలో గత మూడేళ్లుగా ఉద్యోగాలిప్పిస్తానంటూ వరంగల్, హైదరాబాద్, సికింద్రాబాద్, నంద్యాలకు చెందిన ఇరవై మంది నుంచి దాదాపు రూ.70 లక్షలు వసూలు చేశాడు. బాధితులెవరైనా గట్టిగా అడిగితే వారిని సచివాలయం వద్దకు రప్పించేవాడు. త్వరలోనే నియామక ఉత్తర్వులు ఇస్తారంటూ నమ్మించి పంపించేవాడు. చివరకు మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయిండంతో దొరికిపోయాడు.