తెలంగాణాలో ఇంటర్ పరీక్షలు రద్దు : ఫస్ట్‌ ఇయర్‌లో వచ్చిన గ్రేడ్‌ల ప్రకారమే...

బుధవారం, 9 జూన్ 2021 (10:55 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలను రద్దు చేసింది. ఈ మేరకు తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం.. ఫస్ట్‌ ఇయర్‌లో వచ్చిన గ్రేడ్‌ల ప్రకారమే సెకండియర్‌లో గ్రేడింగ్‌ ఇవ్వనున్నట్టు తెలిపింది. 
 
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ కష్టతరంగా మారింది. రాష్ట్ర స్థాయిలో పదో తరగతి పరీక్షలను, ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలను రద్దు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు, ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను సైతం రద్దు చేస్తున్నట్లు గత ఏప్రిల్‌ నెలలో ప్రకటించారు. 
 
పరీక్షలు లేకుండానే విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేసింది. అయితే సెకండ్ ఇయర్ పరీక్షలను వాయిదా వేస్తూ.. జూన్ నెలలో నిర్వహించనున్నట్టు ప్రకటించింది. మరోవైపు, ఏపీ సర్కారు మాత్రం పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపుతోంది. దీనిపై విమర్శలు వెల్లువెత్తున్నా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు