తెలంగాణలో రాబోయే రెండ్రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతాయని, అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలని సీఎస్ సోమేష్‌కుమార్‌కు సీఎం ఆదేశించారు.
నిజానికి వేసవిలో ఏర్పడే క్యుములోనింబస్ మేఘా లు వర్షాకాలంలో పూర్తిగా తగ్గిపోవాల్సి ఉంది. కానీ, ఇప్పటికీ అవి ఆకాశంలో 800-10,000 మీటర్ల ఎత్తులో అక్కడక్కడా ఆవరించే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో సాధారణ వర్ష మేఘాలకు ఈ క్యుములోనింబస్ మేఘాలు తోడవుతుండడంతో.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
భారీ వర్షాలకు ఇల్లు కూలి ఇద్దరి మృతి
హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నిన్న కురిసిన వర్షానికి పాతబస్తీలో పాత రేకుల ఇల్లు కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఇంట్లో ఉన్న ఏడుగురికి తీవ్రగాయాలు అయ్యాయి.