తెలంగాణలో కరోనా టెస్టులు, ఇంకా కరోనా వైద్యానికి సంబంధించిన వివరాలపై హైకోర్టు సీరియస్ అయ్యింది. తెలంగాణలో కరోనా పరిస్థితులపై ప్రభుత్వంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా వివరాలు అధికారులు సరిగా చూపించడంలేదని అన్నారు. తెలంగాణలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుంటే.. ప్రభుత్వం నిద్రపోతుందా అని మండిపడింది.
కరోనా వివరాలు తెలుసుకోవడం ప్రజల ప్రాథమిక హక్కు అని.. వివరాలు స్పష్టంగా తెలియజేయాలని హైకోర్టు పేర్కొంది. బెడ్లు, వెంటిలేటర్లు వివరాలు ఎందుకు తెలియజేయటం లేదని ప్రశ్నించింది. ప్రజలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడింది. కోర్టు ఆదేశాలు పాటించని ఆదేశాలు పాటించని వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది.