భర్తను వేరొక మహిళతో బెడ్ పైన చూసిన భార్య.. ఆ తరువాత...

మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (13:46 IST)
భార్య ఉంది. కాపురం చేస్తున్నాడు. కానీ అతని మనసు మాత్రం మారింది. పచ్చని కాపురంలో చిచ్చుపెట్టుకున్నాడు. క్షణిక సుఖాల కోసం పరుగులు తీశాడు. ప్రియురాలితో కలిసి ఉండగా దొరికిపోయాడు. రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకుని అతడిని చితక్కొట్టారు. కరీంనగర్ నగరలోని గాంధీనగర్‌కు చెందిన రాశి, నగేష్‌కు రెండేళ్ల క్రితం వివాహమైంది. ఐతే నగేష్‌కు అదే ప్రాంతానికి చెందిన శాంతి అనే యువతితో పరిచయం ఏర్పడి అది కాస్త చివరకు వివాహేతర సంబంధానికి దారితీసింది.
 
క్షణిక సుఖాల కోసం భార్యను వదిలి యువతితో తిరగడం ప్రారంభించారు. ఇలా ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా సంవత్సరం పాటు భార్యను వదిలేసి తిరగడం మొదలుపెట్టాడు. భర్త విషయంలో అనుమానం వచ్చిన భార్య ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేసింది. చివరకు వివాహేతర  సంబంధం అని తెలుసుకుని తన బంధువులను వెంట పెట్టుకుని యువతి ఇంటికి వెళ్ళింది. బెడ్ పైన తన భర్త, యువతి కలిసి ఉండటం చూసి వెంటనే చీపురు, చెప్పులు అందుకుంది. భర్తను చితకబాదింది. రాశి బంధువులు కూడా నగేష్‌ను చితకబాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు