ఇంటర్ విద్యార్థిని చాందినీ జైన్ రెండు రోజుల క్రితం ఇంటి నుంచి అదృశ్యమై హైదరాబాదు శివార్ల లోని అమీన్ పూర్ కొండల్లో శవమై తేలింది. ఆమె మృత దేహానికి పోస్టుమార్టం నిర్వహించగా ఆమె తల, మెడపై తీవ్ర గాయాలున్నట్లు తేలింది. ఆమె చెంపలపై కొరికినట్లు పంటి గాట్లు కూడా స్పష్టంగా వున్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి.
హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో కొద్దిసేపటి క్రితం చాందినీ జైన్ పోస్టుమార్టం ముగిసింది. కాగా చివరిసారిగా చాందినీ నలుగురు స్నేహితులకు ఫోన్లు చేసింది. వీరిలో ఇద్దరిని అనుమానిస్తున్నట్లు చెప్పారు. ప్రధానంగా చాందిని కాంటాక్ట్స్‌లో 'మై హాట్ ఫోన్ నెంబర్' అనే ఫోన్ నెంబరుతో ఆమె ఎక్కువగా సంభాషణలు చేసినట్లు తెలుస్తోంది.