సుభద్రకు ప్రసవ వేదన తీవ్రం కావడం, సమయం మించిపోతుండటంతో ఓ ప్రైవేట్ వాహనంలో వాగు దగ్గరకు బాధితురాలిని కుటుంబ సభ్యులు తరలించారు. అక్కడి నుంచి వన్ జీరో ఎయిట్ సిబ్బందితో పాటు గ్రామస్తులు అతి కష్టం మీద స్ట్రెచర్‌పై గర్భిణీని వాగు దాటించారు.
అనంతరం గర్భిణీని కోటపల్లి హీహెచ్‌కి తరలించే ప్రయత్నం చేశారు. అయితే సుభద్రకు పురిటినొప్పులు మరింత తీవ్రం కావడంతో అంబులెన్స్‌ను మార్గమధ్యలోనే నిలిపివేసి, ఉన్నత అధికారుల సూచనతో 108 సిబ్బందే పురుడు పోశారు. సుభద్ర పండంటి బిడ్డకు జన్మనివ్వగా తల్లీబిడ్డను కోటపల్లి ప్రాధమిక ఆసుపత్రికి తరలించారు.
ఇక అత్యవసర సమయంలో స్పందించిన 108 సిబ్బందికి, గ్రామస్తులకు సుభద్ర కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. తమ ఇబ్బందులను ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించాలని, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు. సరైన రోడ్లు, వాగులపై బ్రిడ్జిలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. తక్షణమే గిరిజన తండాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.