ఆయన టూరిజం ప్లాజాలో మాట్లాడుతూ నీరా అమ్మకాలను ప్రభుత్వం ఆధ్వర్యంలో చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారని, రానున్న రోజుల్లో అన్ని జిల్లాల్లో నీరాను సరఫరా చేస్తామని చెప్పారు. నీరాలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని అన్నారు.
హైదరాబాద్ నీరా అమ్మకాలు చేస్తున్నందుకు సీఎం కేసీఆర్ కు గౌడ సామాజికవర్గం తరుపున కృతజ్ఞతలు చెబుతున్నానని మంత్రి అన్నారు. నీరాకు లైసెన్స్ గౌడ కులానికి మాత్రమే ఇస్తామని, నీరాను గీయడం ,అమ్మడం గౌడలు మాత్రమే చేయాలని సీఎం కేసీఆర్ చెప్పారని మంత్రి అన్నారు.
నీరాలో అనేక ఔషధ గుణాలు ఉన్నందువల్ల షుగర్, మధుమేహ వ్యాధి కూడా తగ్గుతాయని, కంబోడియా,ఆఫ్రికా ,ఇండోనేషియా, మలేషియా, శ్రీలంకలో దీని ఉత్పత్తి ఎక్కువ గా ఉందని అన్నారు. అమెరికాలో ఈ మధ్యనే ప్రారంభించారని చెప్పారు.