ఈ ఆన్‌లైన్ తరగతులను టీ-శాట్, దూరదర్శన్‌ల ద్వారా నిర్వహిస్తారు. అలాగే ఇంటర్ ద్వితీయ ఏడాదితో పాటు, ఇంజనీరింగ్ వంటి వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన తరగతులనూ గురువారం నుంచే ప్రారంభిస్తున్నారు.
మరోవైపు, ఆయా తరగతులకు చెందిన విద్యార్థులకూ ఆన్‌లైన్ ద్వారానే బోధన జరుగుతుంది. ఇంటర్ ద్వితీయ ఏడాది చదువుతోన్న విద్యార్థులు సుమారు 4.5 లక్షల మంది ఉన్నారు. కరోనా వైర్‌సను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆన్‌లైన్ ద్వారానే పాఠాలు చెప్పాల్సి ఉంటుంది.