జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్‌పై పోసాని కృష్ణమురళీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ... పవన్ రెమ్యునరేషన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటాడని ఆయన ఆరోపించారు.
ఆయన చేసే సినిమాలోని హీరోయిన్ను, లోకేషన్, పారితోషికం, కథ తానే స్వయంగా సెలెక్ట్ చేసుకుంటాడు. తన సినిమాలకు రూ. 50 కోట్లు తీసుకోవట్లేదని పవన్ నిరూపిస్తే.. నన్ను చెంపదెబ్బ కొట్టండి అని పోసాని వ్యాఖ్యనించారు.