ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ శెలవుపై వెళ్లనున్నారన్న నేపధ్యంలో డ్రగ్స్ దందాపై ఆయనపై ఒత్తిడి పెరిగిందనీ, ప్రభుత్వం ఒత్తిడి కారణంగా ఆయన సెలవుపై వెళుతున్నారంటూ మీడియాలో ప్రచారం జరిగింది. దీనితో స్పందించిన తెలంగాణ ప్రభుత్వం అకున్ సెలవును రద్దు చేసింది.
డ్రగ్స్ కేసు కీలక దశలో వుండటంతో ఆయన సెలవు తీసుకుంటే సంకేతాలు తేడాగా వుంటాయనీ, ఇప్పటికే ఇలాంటి ప్రచారం జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నది. దీనితో అకున్ సబర్వాల్ తన సెలవును రద్దు చేసుకుని మత్తు రాయుళ్ల పని పట్టనున్నారు.