నిరుద్యోగులకు ఉచితంగా కోచింగ్ అందించేందుకు తెలంగాణ సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యే గ్రూప్స్ ఉద్యోగాలకు ఎస్సీ అభ్యర్థుల కోసం ఫౌండేషన్ కోర్సు కింద 45 రోజుల నుంచి 60 రోజుల స్వల్ప కాలిక శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వేణుగోపాల్ తెలిపారు.