ఫిట్స్ వచ్చింది.. పోలీస్ స్టేషన్ లోనే యువకుడి మృతి

సోమవారం, 28 ఆగస్టు 2023 (15:38 IST)
తెలంగాణ రాష్ట్రంలోని బెల్లంపల్లిలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగస్ట్ 26 (శనివారం) రాత్రి ఓ యువకుడు మరణించాడు. ఈ ఘటన అంతా పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. మూర్ఛ రావడంతో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోమవారం బయటకు వచ్చాయి. 
 
సీసీటీవీ ఫుటేజీలో, పోలీసు కానిస్టేబుల్‌లలో ఒకరు ఆ యువకుడికి మూర్ఛ రావడంతో అతని వద్దకు రావడం కనిపించింది. ఓ విచారణ కోసం ఆ యువకుడిని పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారు. 
 
అయితే కుర్చీపై కూర్చున్న యువకుడు ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో కుప్పకూలిపోయాడు. అనంతరం పోలీసులు అతడిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడికి వచ్చేసరికి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వ్యక్తి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు