స్నేహారెడ్డితో బన్ని పెళ్లి ఫిబ్రవరిలో ఖాయం: అరవింద్
WD
తన పెద్ద కుమారుడు అల్లు అర్జున్ వివాహం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిపేందుకు నిర్ణయించామని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గురువారం తెలిపారు.
నిజానికి తాము వచ్చే నెల కార్తీకమాసంలో చేయాలని అనుకున్నామనీ, కానీ బద్రీనాథ్ షూటింగ్ విదేశాల్లో జరుగుతుండటంతో ఇబ్బంది తలెత్తే అవకాశం ఉన్నదని బన్నీ అన్నాడని చెప్పారు.
కనుక ఈ చిత్రం షూటింగ్ ముగిసిన తర్వాత జనవరి చివరిలోగానీ లేదంటే ఫిబ్రవరిలో పెళ్లి చేయాలని తాము నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.