అతడితో నటించకపోతే తాటాకులు కట్టేస్తారా..?: కాజల్

శుక్రవారం, 26 అక్టోబరు 2012 (14:13 IST)
WD
నటి కాజల్‌ అగర్వాల్‌కు కోపమొచ్చింది. పండుగనాడు కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా అంటూ మీడియాను నిలదీసింది. ఇటీవలే ఆమె ఓ ఫంక్షేన్‌కు హాజరయింది. ఇప్పటికే కాజల్‌పై పలు రూమర్లు వచ్చాయి.

తమిళ సూర్యతోపాటు, విజయ్‌ సరసన తుపాకిలో నటించింది. డిసెంబర్‌లో ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఎన్‌.టి.ఆర్‌., అల్లు అర్జున్‌ చిత్రాల్లో బుక్‌ అయింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నా గురించి చాలా రకాల రూమర్లు వస్తున్నాయి. వాటి గురించి వివరణ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. దానివల్ల మీడియా అంటేనే కొన్నిసార్లు భయమేస్తుంది.

మీడియాకు దూరంగా ఉండటమే బెటర్‌ అని తేల్చేసింది. తానిప్పుడు తమిళ, తెలుగు, హిందీ భాషల్లో బిజీగా ఉన్నానని బడాయి కొడుతోంది. తానిప్పుడు కెరియర్‌ గురించే ఆలోచిస్తున్నాననీ, రవితేజ, ఎన్‌.టి.ఆర్‌. చిత్రాలతో బిజీగా ఉన్నానని చెప్పుకొచ్చింది. మరో ప్రముఖ హీరోతో చేయాల్సి ఉన్నా డేట్స్‌ కుదరక వదులుకున్నానని కబుర్లు చెపుతోంది. దీనికే తాటాకులు కట్టాలా? అని నిలదీస్తుంది. ఇలాంటి వాటికి తానేమీ బాధ్యురాలిని కాదని చెప్పింది.

వెబ్దునియా పై చదవండి