నటి స్నేహ ఘాటు జవాబు

సినిమాల్లో నటిస్తున్నంత మాత్రాన తాము సెక్స్ వర్కర్లు కాదంటూ సినీ నటి స్నేహ ఘాటుగా సమాధానం ఇచ్చింది. పలు తమిళ పత్రికలు పలువురు హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలకు అక్రమ సంబంధాలు అంటగడుతూ ఇష్టానుసారంగా వార్తలను రాస్తున్నాయి. ముఖ్యంగా, అవకాశాల కోసం హీరోయిన్లు దర్శకులకు సెక్స్‌వర్కర్లుగా మారారంటూ ఈ పత్రికలు పేర్కొన్నాయి. దీనిపై స్నేహ తీవ్రంగా మండిపడింది. తమది అందాల ప్రపంచమే. 

అంతమాత్రాన హీరోయిన్లు సెక్స్‌వర్కర్లుగా అభివర్ణించడం సమంజసం కాదన్నారు. ఇలాంటి వార్తలను ముద్రించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. అవకాశాల కోసం అంతగా దిగజారాల్సిన అగత్యం ఏ హీరోయిన్‌కు పట్టలేదన్నారు. పత్రికా సంస్థలు తమ సర్కులేషన్లను పెంచుకునేందుకు ఇలాంటి నీచమైన రాతలు రాస్తున్నాయని స్నేహా ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి