బాడీగార్డ్ రీమేక్‌లో వెంకటేష్ సరసన నటించనున్న నాగవల్లి!
WD
"నాగవల్లి"లో వెంకటేష్ సరసన నటించి అందాలను ఆరబోసిన గ్లామర్ క్వీన్ అనుష్క, మళ్లీ విక్టరీ వెంకీ సరసన నటించే మరో అవకాశాన్ని చేజిక్కించుకుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన "బాడీగార్డ్" సినిమా రీమేక్‌లో వెంకీ సరసన ఈ పొడవుకాళ్ల సుందరి అనుష్క నటించబోతుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. వెంకీ, అనుష్క కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాలో అనుష్కను ఎంపిక చేసేందుకు నిర్మాతలు పోటీబడ్డారని సమాచారం.
మలయాళంలో "బాడీగార్డ్", తమిళంలో "కావలన్" తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో అదే పేరుతో రీమేక్ అవుతుందని తెలుస్తోంది. "బాడీగార్డ్" తెలుగు రీమేక్‌ను "డాన్ శీను" ఫేమ్ గోపీచంద్ దర్శకత్వం వహించనున్నాడు. ఏఫ్రిల్ 4న ఈ సినిమా సెట్స్ మీదకి వస్తుందని సమాచారం.
ఇంకా ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించనున్నారు. కాగా, బాడీగార్డ్‌లోసినిమా ద్వారా వెంకీ సరసన బొమ్మాళీ మూడోసారి జతకట్టనుంది. అంతకుముందు చింతకాయల రవి, నాగవల్లి చిత్రాల్లో వెంకీ, అనుష్క కలిసి నటించిన సంగతి తెలిసిందే.