సినిమారంగంలో హీరోయిన్లకు సమస్యలు అనేవి సావిత్రి టైం నుంచే వున్నవే. ఈవేళ ఏదో కొత్తగా లేదు. అప్పట్లో సోషల్‌మీడియా టెక్నాలజీ లేదు. సినిమా వారపత్రికల్లో వచ్చిన వార్తలే ప్రజలకు తెలిసేవి అని సీనియర్ నటి ఆమని తెలియజేసింది. శుభసంకల్పం, శుభలగ్నం, జంబలికిడి పంబ, మిస్టర్ పెళ్ళాం వంటి విజయవంతమైన సినిమాల్లో నటించిన ఆమె తాజాగా తన సోదరి కుమార్తెను నటిగా పరిచయం చేస్తుంది. ఇటీవలే హైదరాబాద్‌లో చిత్ర కార్యాలయానికి వచ్చిన ఆమె అక్కడి సన్నిహితులతో పలు విషయాలు తెలియజేస్తూ కాస్టింగ్ కోచ్‌పై ఆసక్తికరమైన కథనాలు తెలియజేసింది.