ఒకప్పుడు దక్షిణాది చిత్రసీమలో ఓ వెలుగువెలిగిన ఇలియానాకు.. ఇటీవలి కాలంలో సినీ ఆఫర్లు పూర్తిగా కరవయ్యాయి. దీంతో బాలీవుడ్‌కు పయనమైంది. హిందీ పరిశ్రమలో తొలి చిత్రం 'బర్ఫీ' ఇలియానాకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఆమెకు ఆశించిన అవకాశాలు రాలేదు. ఐదేళ్లలో ఈ సుందరి కేవలం ఐదు చిత్రాల్లో మాత్రమే నటించింది. ప్రస్తుతం బాలీవుడ్లో ఇలియానాకు అవకాశాలు పూర్తిగా కరువై పోయాయి.
సినిమాల్లో సుదీర్ఘకాలంగా ఉన్న ఇలియానాకు ఇలాంటి చవకబారు చేష్టలు తగవని హితవు పలికారు. నెటిజన్ల వ్యాఖ్యలపై ఇలియానా మండిపడింది. తన లైఫ్ తన ఇష్టమని, తాను ఎలా వుండాలో ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదని హెచ్చరించింది. తనకు నీతులు చెప్పాలని ఎవరు ప్రయత్నించవొద్దని కోరింది.