అందులో కొత్తగా చేయడమంటేనే ఇష్టం...

గురువారం, 22 ఆగస్టు 2019 (21:07 IST)
నేను ఎన్నో సినిమాల్లో నటించాను. బబ్లీగా ఎన్నో సినిమాల్లో అందరినీ మెప్పించాం. చాలా సంతోషంగా ఉంది. అయితే నాకు ఇంకొన్ని క్యారెక్టర్లు చేయాలన్న ఆలోచన ఉంది. ప్రియురాలిగా ఎన్నో సినిమాల్లో అలరించాను. అది నాకు బాగానే నచ్చింది. నా అభిమానులు నన్ను ట్విట్టర్లో ఆప్యాయంగా పలుకరిస్తున్నారు. అది కూడా నాకు ఇష్టమైన విషయమే.
 
అయితే కొత్తగా చేయాలన్నది నాకు ఎప్పటి నుంచో ఉన్న కోరిక. ఆ కోరిక ఇంకా నెరవేరడం లేదు. రాక్షసుడు సినిమాలో నేను నటించిన క్యారెక్టర్ అందరికీ నచ్చింది.. నేను భయపడుతూ.. హీరోను సముదాయిస్తున్న క్యారెక్టర్ అందరికీ నచ్చింది. అన్నింటి కన్నా టీచర్ గా ఆ క్యారెక్టర్‌కు వందశాతం న్యాయం చేశావని మెచ్చుకున్నారు.
 
అయితే నాకు ఝాన్సీ లక్షీభాయ్ లాంటి క్యారెక్టర్ చేయాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉంది. కత్తి పట్టుకుని ఫైటింగ్ చేయాలని ఉంది. హీరోయిన్ ఓరియంటెడ్ కథగానే ఉండాలి. మొత్తం నా చుట్టూనే కథ తిరుగుతూ ఉండాలంటోంది అనుపమ. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు