యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ అరవిందసమేత. వీర రాఘవ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ పైన అన్నపూర్ణ స్టూడియోలో ఓ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఎస్ఎస్. తమన్ సంగీత దర్శకత్వంలో రూపొందుతోన్న ఆడియోను ఈ నెల 20న గ్రాండ్‌గా రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కొన్ని కారణాల వలన క్యాన్సిల్ అయ్యింది.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా చేయాలనుకుంటున్నారట. ఈ వేడుకను రాయలసీమలో కానీ.. ఆంధ్రలో కానీ చేయాలనుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే... ఈ వేడుకకు అనుకోని అతిథులు బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిసింది. ఇప్పుడు ఇదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్. అక్టోబర్ 1 నుంచి 10 లోపు ఈ వేడుక ఉంటుందట. అక్టోబర్ 11న ఈ భారీ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్, బాలయ్య, చంద్రబాబు.. ఈ ముగ్గురు ఒకే వేదికపై ఉంటే నందమూరి అభిమానులకు నిజంగా పండగే.