తెలుగు చలన చిత్ర దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్ ఇప్పుడు డ్రెగ్ కేసులో ఇరుక్కున్నాడని వార్తలు తెలియజేస్తున్నాయి. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ జరిగినప్పుడు అతనితోపాటు నిర్భయ సింధి, రఘు చరణ్ తదితరులు వున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. పోలీసులు పరిశోధన చేస్తున్నారు. పోలీసుల అదుపులో బీజేపీ నేత కుమారుడు వివేకానంద్ తోపాటు పార్టీ జరిగిన గదిలో డైరెక్టర్ క్రిష్ ఉన్నట్టు ఆరోపణ. అయితే ఇప్పటికే డ్రెగ్ కేసులో పూరీజగన్నాథ్, నవదీప్, చార్మి లాంటివారు కూడా గతంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు.