తమిళనాట రాజకీయాల్లోకి లెజెండ్ కమల్ హాసన్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇందుకు సంబంధించి తెరవెనుక పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఆదివారం కమల్ హాసన్ చెన్నై ఆళ్వార్‌పేటలోని తన ఆఫీసులో ఫ్యాన్స్ సంఘాల నేతలతో అత్యవసరంగా చర్చలు జరిపారు. కమల్‌కు సంఘం నేతలు సూచనలు, సలహాలు ఇచ్చినట్లు సమాచారం.
ఈలోపు పన్నీర్ సెల్వం సీఎం పదవికి రాజీనామా చేయడం.. చిన్నమ్మ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడం.. ఆపై చిన్నమ్మ కూడా జైలుకు వెళ్లడం చకచకా జరిగిపోయాయి. ఇంకా పళనిస్వామి సర్కార్ రావడం వంటి రాజకీయ పరిణామాలపై కమల్ హాసన్ ట్విట్టర్ ద్వరా స్పందించారు. తాను రాజకీయాల్లోకి రావాలని ఫ్యాన్స్ ఆహ్వానించవద్దంటూ వ్యాఖ్యానించాడు.
కానీ తమిళనాడులో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కమల్‌హాసన్ ఎంట్రీపై చర్చ సాగుతోంది. తమిళ ప్రజల సమస్యలను పరిష్కరించకపోతే, తామే ఆ పని చేస్తామంటూ ప్రకటన చేశాడు. అలాగే కమల్‌కు కోలీవుడ్‌లో బలమైన మద్ధతుదారులు వున్నారు.