నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం గురించి గతంలో వార్తలు వచ్చాయి కానీ.. ఈమధ్య కాలంలో అసలు మోక్షజ్ఞ గురించి ఏ వార్త బయటకు రావడం లేదు. బాలయ్య మాత్రం ఓవైపు ఎన్టీఆర్ బయోపిక్ పనుల్లో, మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. వీటితో పాటు బసవతారకం క్యాన్సర్ హాస్పటల్ పనుల్లో కూడా పాల్గొంటున్నాడు. మోక్షజ్ఞ తొలి చిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మించనున్నారని అప్పట్లో బాగా వార్తలు వచ్చాయి.
కానీ... ఈ విషయం గురించి అసలు బాలయ్య పట్టించుకోవడం లేదా అనిపిస్తోంది. ఇదిలాఉంటే... మోక్షజ్ఞ ప్రస్తుతం ఫిల్మ్ నగర్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి ఓ రెస్టారెంట్‌కి వస్తున్నాడట. బాగా లావుగా కనిపిస్తున్నాడని తెలిసింది. క్రిష్ మాత్రం లావు తగ్గితే ఎన్టీఆర్ బయోపిక్‌లో ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రను మోక్షజ్ఞతో చేయించాలనుకుంటున్నాడట. మరి... లావు తగ్గి ఎన్టీఆర్ బయోపిక్‌లో ఎంట్రీ ఇస్తాడో లేదో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.