నయనతారకు బ్యాడ్ టైమ్.. రూ.20 కోట్లు గోవిందా!?

మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (19:10 IST)
దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతారకు బ్యాడ్ టైమ్ అంటూ సినీ పరిశ్రమ అంతటా ఒకటే టాక్. విక్కీని ప్రేమించి పెళ్లి చేసుకున్న నయనతార ప్రస్తుతం మాతృత్వాన్ని కూడా ఆస్వాదిస్తోంది. తన కవలపిల్లలతో గడుపుతోంది.  
 
నయనతార మార్కెట్ పడిపోయింది.. అజిత్ 62 నుంచి విఘ్నేష్ శివన్ తప్పుకున్నారు. దీన్ని సమర్థించిన నయన్‌కు అవమానమే మిగిలింది. ఇది చాలదన్నట్టు... ప్రముఖ నిర్మాత వెట్రి చిత్రంలో నటించిన నయనతార ఆ తర్వాత ఆయన నిర్మాణంలో రెండు సినిమాలకు కమిట్ అయింది. 
 
ఇందుకోసం అడ్వాన్స్‌గా డబ్బులు కూడా తీసుకున్న నయనతార కాల్షీట్ ఇవ్వకుండా జాప్యం చేస్తోంది. దీంతో స్ట్రిక్ట్ ప్రొడ్యూసర్ డబ్బులు లాగేసుకుని మరో నటిపై సంతకం చేశాడు. దీంతో రూ.20కోట్లు నయనతార చేతులారా కోల్పోయిందని కోలీవుడ్ టాక్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు