దక్షిణాది అగ్ర హీరోయిన్ నయనతార పెళ్ళి గురించే ప్రస్తుతం జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పటికే రెండు ప్రేమాయణాలకు ఫుల్ స్టాప్ పెట్టిన ఈ భామ దర్శఖుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమాయణం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. హ్యాపీగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ వచ్చిన ఈ జంట ప్రస్తుతం పెళ్ళికి రెడీ అయిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకు ముందే వీరికి పెళ్లయిపోయిందనే వార్తలు వచ్చాయి, కానీ అది ఒట్టి పుకార్లని తెలిసింది. ప్రస్తుతం వివాహానికి వీరు సిద్ధం అయ్యారని, త్వరలోనే పెళ్లి జరగవచ్చని కోలీవుడ్ జనం మాట్లాడుకుంటున్నారు.
కాగా ఇటీవల సీమా అవార్డ్స్ ఫంక్షన్‌లో ఈ జంట కనిపించింది. శింబు, ప్రభుదేవాలతో ప్రేమాయణానికి బ్రేకప్ ఇచ్చిన తర్వాత విఘ్నేష్‌తో స్నేహం ప్రేమగా మారిందని.. త్వరలో అతనిని పెళ్ళాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు సన్నిహితులతో నయన్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. విఘ్నేష్ శివన్ శింబుతో పోడా పోడీ, విజయ్ సేతుపతితో నానుమ్ రౌడీదాన్ వంటి సినిమాలను తెరకెక్కించి మంచి ఫామ్‌లో ఉన్నాడు.