గ్లోబల్ నటీమణి.. బాలీవుడ్ హాట్ తార ప్రియాంక చోప్రా బోల్డ్‌గా బదులివ్వడంలో ముందుంటుంది. ఇటీవల విదేశీ గడ్డపై పీపుల్స్ ఛాయిస్ అవార్డు అందుకుంది. ఈ సందర్భంగా విలేకరి అడిగిన ప్రశ్నకు ప్రియాంక చోప్రా ధీటుగా సమాధానమిచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి మీడియా అడిగిన ప్రశ్నకు ఒక్క జవాబుతో నోటికి తాళంవేసింది. డొనాల్డ్ ట్రంప్ అంటే తనకు భయం లేదని.. తాను భారతీయురాలినని వ్యాఖ్యానించి అందరికీ షాక్ ఇచ్చింది.
తాజాగా కాఫీ విత్ కరణ్‌లోనూ బోల్డుగా కరణ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. బాలీవుడ్‌లో చాలా రియాలిటీ షోస్ ఉన్నప్పటికీ, ‘కాఫీ విత్ కరణ్’ షోకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇందుకు కారణం సెలెబ్రిటీల వ్యక్తిగత రహస్యాలు బహిరంగం కావడమే. మాములుగా అయితే ఇద్దరు స్టార్స్‌తో ఇంటర్వ్యూ చేసే కరణ్, ఈసారి మాత్రం ప్రియాంక చోప్రా ఒక్కదానితోనే షో చేశాడు.