సూపర్ స్టార్ రజినీకాంత్ - గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న సంచలన చిత్రం 2.0 లైకా ప్రొడక్షన్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఈ సినిమాపై ఫస్ట్ నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. అయితే... ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ.. కొన్ని కారణాల వలన ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. అయినప్పటికీ ఈ మూవీపై క్రేజ్ ఏమాత్రం పోలేదు. అభిమానులతోపాటు ఆడియన్స్ కూడా ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు 2.0 స్టోరీ ఏంటి అనేది డైరెక్టర్ శంకర్ చెప్పలేదు. అయితే.. 2.0 స్టోరీ అంటూ ఓ కథ ప్రచారంలోకి వచ్చింది. అది ఏంటంటే... సెల్ టవర్స్ వలన వచ్చే రేడియేషన్ వలన చాలా పక్షులు చనిపోతున్నాయి. ఈ విషయం గ్రహించిన పక్షులు మానవులపై దాడి చేస్తే ఎలా ఉంటుందనేదే 2.0 స్టోరీ అని తెలిసింది.
ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పక్షిగా నటించారట. రజినీ, అక్షయ్ పైన చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునేలా ఉంటాయట. కథ వినడానికి చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంది. ఈ కథేనా..? లేక వేరే కథా.? అనేది తెలియాల్సి వుంది.