వేస్ట్‌గాడంటూ పోస్ట్‌లు పెడుతున్నారు అన్నా.. జూ.ఎన్టీఆర్ వద్ద బోరున ఏడ్చిన సంపూ

సోమవారం, 31 జులై 2017 (11:02 IST)
బిగ్‌బాస్ షో నుంచి హీరో సంపూర్ణేష్ బాబు అర్థంతరంగా నిష్క్రమించాడు. దీంతో ఆయనపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలు సంపూను తీవ్రంగా బాధపెడుతున్నాయి. వీటిపై సంపూ స్పందించాడు. 
 
హౌస్‌ నుంచి వీడిన హీరో సంపూర్ణేష్ బాబు టీవీలో తళుక్కున మెరిసి తన అనుభవాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు. తాను బిగ్ బాస్‌ను వీడటానికి గల కారణాలను ప్రేక్షకులకు పంచుకున్నారు.
 
గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన తాను  బిగ్ బాస్‌ హౌస్‌లో ఇమడలేకపోయానని, ఈ విషయంలో తనను వేస్ట్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారని ఇవి చాలా బాధపెడుతున్నాయంటూ సంపూ వ్యాఖ్యానించి.. బోరున విలపించాడు. వెంటనే సంపూను జూ.ఎన్టీఆర్ దగ్గరకు తీసుకుని ఓదార్చారు. 

వెబ్దునియా పై చదవండి