పదేళ్ల పాటు హీరోయిన్‌గా కొనసాగుతున్న శ్రియ.. తాజాగా బాలయ్యకు జోడీగా పైసా వసూల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పదేళ్ల తన సినీ కెరీర్‌లో శ్రియ దాదాపు అగ్రహీరోల సరసన నటించారు. ఈ నేపథ్యంలో త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు టాలీవుడ్ వర్గాలు కోడైకూస్తోంది. తాను త్వరగా పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులు ఒత్తిడి తీసుకురావడంతో ఆమె వివాహం చేసుకునేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే శ్రియ ప్రస్తుం వీరభోగ వసంతరాయలు అనే చిత్రంలో నటిస్తోంది. క్రైమ్ థ్రిల్లర్, ఎంటర్‌టైనర్ అయిన ఈ చిత్రంలో నారా రోహిత్, సుధీర్ బాబు నటిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రియ ఎయిర్ హోస్టెస్‌గా కనిపిస్తుంది. వీరభోగ వసంతరాయలు సినిమా పనుల్లో అమ్మడు బిజీ బిజీగా వుంది.