బాలీవుడ్ స్టార్ జంట మలైకా అరోరా, ఆమె భర్త ఫిల్మ్ మేకర్ అర్బాజ్ ఖాన్ల మధ్య మనస్పర్ధలు వచ్చాయని.. వారిద్దరూ విడాకుల కోసం కోర్టు మెట్లెక్కారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. విడాకుల కోసం ఇద్దరూ గత నవంబరులో తమ లాయర్లతో ఓ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. కానీ విడాకుల్లేవ్.. విందులే అన్నట్టు ఇద్దరూ తరచూ కలిసి కనబడుతున్నారు.
అర్బాజ్‌తో కలిసి ఈ 43 ఏళ్ళ అమ్మడు గోవాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోవడం చూసి వీళ్ళంతా ముక్కున వేలేసుకున్నారు. ఈ ఫోటోను మలైకా సోదరి, నటి కూడా అయిన అమృతా అరోరా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. ఈ సెలబ్రేషన్స్‌లో వీరి కొడుకు అర్హాన్, తల్లి కూడా పార్టిసిపేట్ చేయడం విశేషం.