పక్కన ఏ పురుషుడు కనిపించినా లింక్ పెట్టేశారు, ఆ నటి ఆవేదన?

మంగళవారం, 18 ఆగస్టు 2020 (17:08 IST)
సురేఖా వాణి. తెలుగు సినిమాల్లో అక్కగానో, చెల్లెలిగానో లేకుంటే హీరో తల్లిగానో ఇలా రకరకాల క్యారెక్టర్లో కనిపిస్తూ మెప్పించింది. ఎన్నో సినిమాల్లో నటించిన సురేఖా వాణి ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సైలెంట్‌గా ఉంటోంది. ఇండస్ట్రీలో తనపై వస్తున్న వదంతులపై ఆమె తెగ బాధపడుతోందట.
 
తను ఎన్నో క్యారెక్టర్లలో నటించినా, ఏ క్యారెక్టర్లో నటించినా, ఎవరి పక్కన నడిచి వెళుతున్నా.. అంటే నా తండ్రి, బ్రదర్, లేక కజిన్ ఇలా పురుషుడు ఎవరైనా తన పక్కనే నడిచి వెళుతుంటే వెంటనే నాకు అతనికి లింక్ కట్టేస్తూ గాసిప్స్ పుట్టిస్తారు.
 
అది ఇప్పటి సమాజం. ఏం చేస్తాం. నా చేతిలో సినిమాలు ప్రస్తుతం లేవు. అయితే నేను నా కూతుర్ని సినీరంగంలోకి తీసుకొస్తున్నా. సుప్రిత త్వరలో సినీరంగంలో అడుగుపెడుతుంది. కానీ నాపై జరుగుతున్న దుష్ప్రచారం మాత్రం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను అని బాధపడుతోందట సురేఖ వాణి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు