ఎందుకో ఎదుటివారు బాధపడినా నేను చూస్తూ ఉండలేను. చాలా బాధగా అనిపిస్తుందని చెబుతోంది శ్వేతాబసు. ఇదే విషయాన్ని నా తల్లికి ఫోన్లో చెప్పా. మా అమ్మ, సోదరుడు ఇద్దరూ కలిసి నేనున్న అపార్టమెంట్‌కు వచ్చారు. కానీ వాళ్లను నేను ఉన్న గదికి రమ్మని పిలువలేదు. తెలిసిందేగా కరోనా. కనీసం ఆప్యాయంగా తల్లిని హత్తుకుని ఏడుద్దామనుకున్నా అదీ లేదు. ఐదు అడుగుల దూరంలో నిలబడి మాట్లాడి పంపించేశాను. ఈ కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోవాలని దేవుళ్ళను ప్రార్థిస్తున్నానని బాధపడుతూ చెబుతోంది శ్వేతాబసు.