శాటిలైట్ బిజినెస్‌ను ఏవో కొన్ని సినిమాలకు మినహా వ్యాపారం చేయకపోవడంతో కొన్ని అగ్రహీరోల సినిమాలనే ఆదివారం పండగకు రోజువారీ సినిమాలు.. చూసినవే చూస్తుడటం విసుగు తెప్పిస్తున్నాయి. శుక్రవారం ఇదే విషయమై ఫిలింఛాంబర్‌లో చర్చ జరిగింది. చాలామంది రిపిట్ సినిమాలు వేయడంతో తమకు ఫోన్లు వస్తున్నాయని ఈ సందర్భంగా చర్చ జరుగగా శాటిలైట్ బిజినెస్ ద్వారా అన్ని సినిమాలను తీసుకునేలా చర్యలు జరిగితేనే మరిన్ని సినిమాలు ప్రేక్షకులకు అందించగమని కార్యవర్గం తెలిపింది.
రెండేళ్ళనాడు శాటిలైట్ వ్యాపారం బాగా జరగడంతో ఇబ్బడిముబ్బడిగా దాన్ని అడ్డుకుని సినిమాలు తీసేవారు పెరిగిపోయారు. చాలా చిత్రాలు కనీస నిబంధనలు పాటించకుండా చెత్త సినిమాలు తీయడంతో అన్ని ఛానల్స్ శాటిలైట్ సినిమాలు కొనకుండా ఓ నిర్ణయానికి వచ్చాయి. ప్రముఖ హీరోల చిత్రాలు మినహా ఎటువంటి చిత్రాన్ని కొనడానికి అవి ముందుకురాలేదు. ఇది ఇంకా ఎన్ళాళ్లు కొనసాగుతుందో ప్రేక్షకులు ఇంకెంతకాలం చూసిన సినిమాలే చూడాల్సి వస్తుందో కాలమే నిర్ణయించాలి.